Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జానీ మాస్టర్ వ్యవహారంలో శేఖర్ బాషా ఆసక్తికర కామెంట్స్

Shekhar Bhasha interesting comments on Johnny Master
Advertisement
  • ఆ అమ్మాయి ఇప్పుడే ఎందుకు కేసు పెట్టిందన్న శేఖర్ బాషా
  • ఆ అమ్మాయి మంచిదేనని విన్నానని వెల్లడి
  • ఈ కేసు పై తన ఆలోచనలు పంచుకున్న వైనం
Advertisement
జానీ మాస్టర్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా లేడీ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం పై ప్రముఖులు కొందరు స్పందిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని కోరుతున్నారు. తాజాగా, బిగ్ బాస్ ఫేమ్, ఆర్జే శేఖర్ బాషా ఈ వ్యవహారంపై స్పందించారు. 

ఒక ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ వ్యవహారం గురించి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం...

బిగ్ బాస్ 8 లో శేఖర్ బాషా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఆర్జేగా, యాంకర్ గా శేఖర్ బాషా అందరికీ సుపరిచితమే. ఇప్పుడు బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత ఎగ్జిట్ కావడం అనంతరం ఇంకా పాపులర్ అయ్యారని చెప్పొచ్చు. 

శేఖర్ బాషా బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టిన కొన్ని రోజులకే తన భార్య డెలివరీ అవ్వడంతో బాబుని చూసుకోవడానికి బిగ్ బాస్ నుండి వచ్చేశారు. ఇదిలా ఉంటే శేఖర్ బాషా కొన్ని రోజుల క్రితం రాజ్ తరుణ్ వ్యవహారంలో కూడా లావణ్య మీద ఆరోపణలు చేయడం, మీడియా సమక్షంలోనే లావణ్య... శేఖర్ బాషాని కొట్టడం, ఈ వ్యవహారం అంతా సోషల్ మీడియాలో రావడంతో శేఖర్ బాషా హాట్ టాపిక్ అయ్యారు.

ఇప్పుడు తాజాగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో యాంకర్ మీరు అబ్బాయిలకే ఎక్కువ సపోర్ట్ చేస్తారని అందరికీ తెలుసు... మరి జానీ మాస్టర్ వ్యవహారంపై మీ స్పందన ఏంటి? అని అడిగిన ప్రశ్నకు శేఖర్ బాషా బదులిచ్చారు.  

"ఈ వ్యవహారం గురించి నేను ఎక్కువ లోతుగా వెళ్లలేదు. అందరూ మాట్లాడుకునే దాన్నిబట్టి నేను టీవీలో చూసిన దాన్ని బట్టి నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి ఇన్ని రోజులుగా జానీ మాస్టర్ మీద కేసు పెట్టకుండా ఇప్పుడే ఎందుకు ఈ కేసుని పెట్టాలనుకుంది అనే పాయింట్ నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఈ ప్రశ్నకి సమాధానం నాకు దొరకట్లేదు. 

ఆ అమ్మాయి గురించి కూడా నేను విన్నాను. ఆ అమ్మాయి చాలా మంచిదని, డబ్బుల కోసం ఇలా చేస్తుందని అనుకోవట్లేదు. చాలా సందర్భాల్లో ఆయన్ని పొగుడుతూ మాట్లాడిన అమ్మాయి ఇప్పుడు కేసు ఎందుకు పెట్టింది? ఇక జానీ మాస్టర్ నుంచి విడిపోవడానికే ఇలాచేసిందని ఒక చిన్న డౌటు. కానీ, ఇలా విడిపోవడానికి ఇంత పెద్ద కేసు పెడతారని నేను అనుకోవట్లేదు. 

పోలీసులు కూడా పెద్ద సెక్షన్ల కింద కేసు పెడితే మీకు న్యాయం జరుగుతుంది అని బాధితులతో చెప్పడం మనం ఈ కేసులో అని కాకపోయినా చాలా కేసుల్లో చూశాం. కాబట్టి అలాంటి తీరు మారాలి అని నా అభిప్రాయం.

 జానీ మాస్టర్ గురించి కూడా ఇప్పటివరకు నెగిటివ్ గా నేను ఏమీ వినలేదు. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వ్యవహారం గురించి మీకు త్వరలోనే చెబుతాను " అని శేఖర్ బాషా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మీరు ఎప్పుడూ అబ్బాయిలకి ఎక్కువ సపోర్ట్ చేస్తారు... అమ్మాయిల వైపు మాట్లాడడానికి చాలామంది వస్తారు... అబ్బాయిల వైపు మాట్లాడడానికి శేఖర్ భాష ముందుకు వస్తారు కదా... అని యాంకర్ అడిగిన ప్రశ్నకు శేఖర్ బాషా "అవును" అని సమాధానం ఇచ్చారు.


Advertisement
Advertisement
Jani Master
shekar basha

More Telugu News